హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి ఆలయాన్ని పచ్చ కర్పూరంతో శుద్ధి

 అనంతపురం: గుంతకల్ పట్టణంలో వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం పూజా సేవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయాన్ని పచ్చ కర్పూరంతో శుద్ధి చేశారు. ఆలయ అర్చకుడు మాట్లాడుతూ.. దసరా, వైకుంఠ ఏకాదశి, ఉగాది, అణివర ఆస్థానము పండుగలకు ముందు వచ్చే మంగళవారం రోజున ఈ పూజ చేస్తామన్నారు.