SKLM: జిల్లా వైసీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అనుబంధ విభాగాల అధ్యక్షులతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, కమిటీల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ భేటీలో డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య, తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలి'


