హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమలాపురంలో విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ప్రారంభం

కోనసీమ: జిల్లా కలెక్టరేట్‌‌లో విలేజ్ హెల్త్ క్లినిక్‌‌ల వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇందుపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పలువురు నాయకులు పాల్గొన్నారు.