హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వన్యప్రాణి సంరక్షణపై విద్యార్థులకు అవగాహన

ప్రకాశం: అర్థవీడు మండలంలోని రంగాపురం ZPHS పాఠశాలలో మంగళవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం వన్యప్రాణి, అటవీ సంరక్షణపై అవగాహన కల్పిస్తూ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అధికారి ముక్కు ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.