హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేలులో ఘనంగా వరుణ యాగం

KDP: బద్వేలులోని దేవి భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. గోపూజ, పంచామృత అభిషేకం, వరుణ హోమం, నవగ్రహ హోమం, మహా రుద్రాభిషేకం చేపట్టారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మంచూరు సూర్యనారాయణరెడ్డి స్వామివారిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.