కాకినాడ: లోకం సుభిక్షంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతూ మంగళవారం కాకినాడ బాలా త్రిపురసుందరి ఆలయంలో వరుణ హోమాలు ఘనంగా చేశారు. MLA వనమాడి కొండబాబు, డిప్యూటీ కమిషనర్ రమేశ్ బాబు, ఆలయ ఛైర్మన్ గ్రంధి బాజ్జి, EO వీర్రాజు చౌదరి ఈ హోమాన్ని ప్రారంభించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్లే హోమం చేపట్టినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బాలా త్రిపురసుందరి ఆలయంలో వరుణహోమం


