హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెడనలో వరుణ యాగంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్

కృష్ణా: పెడన పట్టణంలోని శ్రీ పైడమ్మ తల్లి ఆలయంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరుణ జపం, వరుణ యాగంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, నియోజకవర్గ రైతాంగం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖశాంతులతో ఉండాలని శ్రీ పైడమ్మ తల్లిని ప్రార్థించారు.