హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రీ-సర్వే ప్రక్రియను పకడ్బందీగా అమలు చేయాలి'

NLR: సీతారామపురం(M) పెదనాగంపల్లిలో జరుగుతున్న రీ-సర్వే ప్రక్రియను ట్రైనీ కలెక్టర్ పవన్ తేజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రీ-సర్వే పనుల పురోగతిని పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా రీ-సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి ఆదేశించారు. భూముల వివరాల నమోదు, కొలతల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.