హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నూతన బస్‌స్టాప్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

కృష్ణా: పామర్రు పట్టణంలో రూ.25 లక్షల వ్యయంతో నూతన బస్‌స్టాప్, మహిళల టాయిలెట్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పనుల పురోగతి, నాణ్యతను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.