ELR: న్యాయమైన హక్కుల కోసం ఉంగుటూరు మండల VRAల చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం 21వ రోజుకు చేరింది. మంగళవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట VRAలు ధర్నా కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. VRAలకు పే స్కేల్ కల్పించాలని, VROలుగా ప్రమోషన్లు కల్పించాలని, VRA నామినీలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
21వ రోజుకు చేరిన సహాయ నిరాకరణ ఉద్యమం


