హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అవిశాయపాలెంలో హోటల్ దగ్ధం

PLD: పల్నాడు జిల్లా అమీన్ సాహెబ్‌పాలెంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాంబాబుకు చెందిన హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా నూనె బాండీ నుంచి మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు వ్యాపించి రెండు గ్యాస్ సిలిండర్లు పేలాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.