హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురవాలి'

SKLM: జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆకాంక్షించారు. ఉత్కలాంధ్ర ఆరాధ్యదైవం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన వరుణ యాగంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలకు సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.