హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ముప్పిడి

E.G: జనసేన నాయకుడు గాయత్రి వెంకటేశ్వరరావు మృతి తనను తీవ్రంగా కలచివేసిందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే, గాయత్రి వెంకటేశ్వరరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. వెంకటేశ్వరరావు ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.