హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్ పరిశీలన

KRNL: ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలోని జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌ను ఏపీపీసీబీ చైర్మన్ డా. పి.కృష్ణయ్య, జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి మంగళవారం పరిశీలించారు. ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రక్రియ, కాలుష్య నియంత్రణకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పర్యావరణ పరిరక్షణకు నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచించారు.