హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం డీఎస్పీగా లక్ష్మణమూర్తి

విజయనగరం డీఎస్పీగా సీపాన లక్ష్మణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆయన ఇంటెలిజెన్స్ విభాగం డీఎస్పీగా విధులు నిర్వహించారు. గతంలో ఆయన ఎస్.కోట సర్కిల్ సీఐగా కొంతకాలం పనిచేశారు. ఇప్పటివరకు చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు విజయనగరం డీఎస్పీగా అదనపు బాధ్యతలు నిర్వహించేవారు.