హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంచినీటి కనెక్షన్ ఇవ్వాలని మహిళల నిరసన

AKP: అంట్లపాలెం ఎస్సీ, ఎస్టీ కాలనీకి మంచినీటి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంపై ఇవాళ గ్రామస్థులు ఖాళీ బిందెలతో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. జలజీవన్ మిషన్ కింద రూ.22 లక్షలతో ట్యాంక్ కట్టినా నీరు ఇవ్వడం లేదని, కరెంట్ లేకపోతే ఫ్లోరైడ్ నీరు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరాహ నది తాగునీటిని అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు.