హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చోరీ సొత్తుతో స్టేషన్‌కు తండ్రి!

కర్నూలు ఎస్‌ఎల్‌వీ కాలనీలో 20 తులాల బంగారం, కిలో వెండి చోరీ చేసిన ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడు చోరీలో ఉన్నాడని తెలుసుకున్న తండ్రి.. చోరీ సొత్తును పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించాడు. తండ్రి నిజాయితీని పోలీసులు అభినందించారు. అతడి సమాచారంతో మరో ఇద్దరు బాలలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.