హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మీభూమి-మీహక్కు పత్రాల పంపిణీ'

ASR: జీకేవీధి మండలం గాలికొండ పంచాయతీ ఎం.బూసికొండ గ్రామంలో 25 మంది రైతులకు రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో మీభూమి-మీహక్కు పత్రాలు పంపిణీ చేశారు. భూముల సర్వేలో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న గ్రామ సర్వేయర్ చంద్రకళను రైతులు సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ సత్యనారాయణ, వీఆర్వో ఈశ్వరరావు, ఎంపీటీసీ బుజ్జిబాబు, కొర్రా చందర్రావు తదితరులు పాల్గొన్నారు.