PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని లుంబేసు పంచాయతీ వామాసి గ్రామానికి రహదారి నిర్మించాలని ఇవాళ ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు సన్యాసిరావు డిమాండ్ చేశారు. గ్రామానికి గతంలో మట్టి రోడ్డు వేసినా వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. రహదారి సౌకర్యం లేక అత్యవసర పరిస్థితుల్లో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వామాసి గ్రామానికి రహదారి నిర్మించాలి'


