హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రొంపిచర్లలో దేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు

PLD: రొంపిచర్ల వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. రోజూ ఉదయం రుద్రాభిషేకాలు, కుంకుమ పూజలు, అన్నదానం, సాయంత్రం భజనలు, లక్కీ డ్రా ద్వారా చీరల బహుకరణ ఉంటాయి. ఆలయ ధర్మకర్త మద్ది రామచంద్రరావు, ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకల్లో భక్తులు అందరూ పాల్గొనాలని జయప్రదం చేయాలని కోరారు.