హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలిక మృతి.. హైకోర్టుకు కేసు

ASR: ఎటపాక మండలం గొల్లగుప్పలో మలేరియా నివారణకు ఇచ్చిన క్లోరోక్విన్ మాత్రలు వికటించి గిరిజన బాలిక మడివి జమున (7) మృతి చెందిన ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. కేసును తదుపరి విచారణ కోసం ఏపీ హైకోర్టుకు బదిలీ చేసింది. ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు అత్యవసరమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.