హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ నేతల పర్యటన

KDP: పులివెందుల ప్రాంతంలోని యురేనియం ప్రభావిత ప్రాంతాల్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పర్యటించారు. కె.కె. కొట్టాల్‌లో కాలుష్య ప్రభావితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం టెయిల్‌పాండ్ ప్రాంతాన్ని అఖిలపక్ష నేతలతో కలిసి పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాలుష్య ప్రభావంపై వివరాలు సేకరించారు.