హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సౌభాగ్య గౌరీగా బగళాముఖీ అమ్మవారి దర్శనం

BPT: చందోలులోని శ్రీ బగళాముఖీ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం అమ్మవారు సౌభాగ్య గౌరీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రత్యేకాలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని చూసేందుకు స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి విచ్చేసి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.