హైదరాబాద్: 28°C
తెలంగాణ

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా 47 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నందిగామ (27), కొత్తూరు (13), చౌదరిగూడ (7) మండలాలకు చెందిన లబ్ధిదారులు ఈ సహాయం పొందారు. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు సీఎంఆర్‌ఎఫ్ కొండంత అండగా నిలుస్తుందని, అర్హులందరికీ త్వరితగతిన నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తామని అన్నారు.