హైదరాబాద్: 28°C
తెలంగాణ

LOC పత్రాలను అందజేసిన బోథ్ MLA

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన కోమరి తిరుపతి కిడ్నీ సమస్యతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 5 లక్షల ఎల్ఓసీ (LOC) పత్రాన్ని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బాధితుడికి మంగళవారం అందజేశారు. BRS నాయకులు జహీర్, దేవేందర్ రెడ్డి, సుజీల్, కార్యకర్తలు తదితరులున్నారు.