హైదరాబాద్: 28°C
తెలంగాణ

భానూరు అభివృద్ధికి బిడిఎల్ సహకరించాలి: ఎమ్మెల్యే

SRD : పటాన్‌చెరులోని భానూరు గ్రామ సమగ్ర అభివృద్ధికి బిడిఎల్ పరిశ్రమ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. మంగళవారం బిడిఎల్ ఈడీ సంపత్ కుమార్‌ను కలిసి కంచర్లగూడెం పాఠశాల భవనం, స్మశానవాటిక అభివృద్ధి, భానూరు–కంచర్లగూడెం బీటీ రోడ్డు మరమ్మతులకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.