హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం'

GDWL: యూనియన్‌ బ్యాంక్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (RSETI) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు క్రియేటివ్‌ జ్యువెలరీ, పుట్టగొడుగుల పెంపకంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్‌ శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 50 ఏళ్ల వయస్సు గలవారు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు గద్వాల బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.