హైదరాబాద్: 28°C
తెలంగాణ

కోర్టు ఆగ్రహించినా తీరు మారదా?

VKB: కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు ఎలా ఇస్తారని హైకోర్టు ప్రశ్నించినా క్షేత్రస్థాయిలో తీరు మారలేదు. వికారాబాద్ జిల్లాలో జరుగుతున్న పంపిణీలో మళ్లీ నాయకులే చెక్కులు అందించి ప్రచారం చేసుకుంటున్నారు. అధికారులను పక్కనపెట్టి రాజకీయ హడావుడి చేయడమేంటని విమర్శలు వస్తున్నాయి. కోర్టు వ్యాఖ్యలను లెక్కచేయకుండా ప్రచారానికే పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు.