హైదరాబాద్: 28°C
తెలంగాణ

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

RR: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. శంషాబాద్ నుంచి అబుదాబి వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద తనిఖీల్లో బుల్లెట్‌ను భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని బుల్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రయాణికుడిని, బుల్లెట్‌ను జీఎంఆర్ ఔటో పోస్ట్ పోలీసులకు అప్పగించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.