హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్‌లో రోడ్డు తవ్వారు.. పూడ్చడం మరిచారు!

MDCL: ఉప్పల్ గణేష్‌నగర్ రోడ్ నంబర్‌-1లో రహదారి తవ్వి పనులు చేపట్టారు. పనులు పూర్తయిన తర్వాత రోడ్డును తిరిగి మరమ్మతు చేయకపోవడంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలు, మట్టి కారణంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అధికారులు వెంటనే స్పందించి రహదారిని పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.