NLG: దేవరకొండ మండలం గొట్టిముక్కల గ్రామానికి చెందిన పిరాటి ఆంజనేయులు మృతి బాధాకరమని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. మంగళవారం గొట్టిముక్కలలో ఆంజనేయులు మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆంజనేయులు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
ఆంజనేయులు మృతి బాధాకరం: మాజీ ఎమ్మెల్యే


