హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘోర ప్రమాదం...ఇద్దరు వ్యక్తులు మృతి

GDWL: నల్లమల ఘాట్ రోడ్డులో మంగళవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. కర్నూలు నుంచి కాకినాడ వెళ్తున్న ఆర్టీసీ హైటెక్ బస్సు, బొలెరో వాహనం ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో బొలెరోలోని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.