హైదరాబాద్: 28°C
తెలంగాణ

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ADB: అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తలమడుగులో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కాడే లస్మన్న (65) తన 2.20 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. సరైన వర్షాలు లేక పంట దిగుబడిపై ఆందోళన చెందడంతోపాటు, ముగ్గురు కుమార్తెల వివాహాల కోసం చేసిన రూ.3 లక్షల అప్పులు, మహారాష్ట్ర బ్యాంకులో ఉన్న రూ.2 లక్షల పంట రుణంతో మనోవేదనకు గురై ప్రాణాలు తీసుకున్నారు.