NRML: భైంసా మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన రైతు భూమేశ్ రెండెకరాల్లో సాగు చేసిన వరి పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తున్నారు. చేతికొచ్చిన దశలో పంట ఎండిపోతుండటంతో నీటి కోసం రైతు ఇబ్బందులు పడుతున్నారు. పొలానికి సమీపంలోనే చెరువు ఉన్నప్పటికీ కాలువ ద్వారా నీరు అందడం లేదని తెలిపారు. చెరువు నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని కోరారు.
తెలంగాణ
పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్‌తో నీరు


