RR: షాద్‌నగర్ పట్టణంలోని హాజీపల్లి రోడ్డు నుంచి శ్రీనివాస్ కాలనీకి వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ మార్గంలో నిత్యం పాఠశాల విద్యార్థులు, ప్రజలు, వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. గుంతల కారణంగా ప్రమాదాల భయం నెలకొంది. అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: గుంతలమయంగా హాజీప- శ్రీనివాస్ కాలనీ రోడ్డు


