హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులకు ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం'

GDWL: మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి భూములిచ్చే వడ్డేపల్లి మండలం తనగల గ్రామ రైతులకు ఎకరాకు రూ. 20 లక్షల పరిహారం అందించేందుకు ప్రభుత్వం అంగీకరించిందని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. రిజర్వాయర్ భూసేకరణకు సహకరిస్తున్న రైతుల నిర్ణయం అభినందనీయమని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు.