MLG: జిల్లా కేంద్రంలోని బాలసదనాన్ని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు సోమవారం సందర్శించారు. బాలికలకు అందుతున్న ఆహారం, విద్య, వసతులు, సంరక్షణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తూ విద్య, ఆరోగ్యం, సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. అనంతరం బాలికలకు పౌష్టికాహార లడ్డూలు పంపిణీ చేశారు.
తెలంగాణ
బాలసదనాన్ని సందర్శించిన కలెక్టర్


