అనంతపురం: గుంతకల్ మండలం కసాపురం గ్రామంలోని నాగరాజు అనే వ్యక్తికి చెందిన బైకును మంగళవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. ఇంటి బయట పార్కింగ్ చేసిన బైకుకు నిప్పు పెట్టడంతో బైకు మొత్తం మంటల్లో ఖాళీ బూడిద అయిందని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
బైక్‌కు నిప్పు పెట్టిన గుర్తు తెలియని దుండగులు


