హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో కుక్కల బెడద.. 9 నెలల్లో 347 మందిపై దాడి

KMR: ఇటు కుక్కల బెడద.. అటు కోతుల భయంతో లింగంపేట వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లింగంపేట మేజర్ గ్రామపంచాయతీలో గత కొంతకాలంగా వీధి కుక్కలు, కోతుల బెడద తీవ్రమైంది. ఉదయం, రాత్రి తేడా లేకుండా వీధుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను గాయపరుస్తున్నాయన్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనదారుల వెంటపడుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.