హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దగదర్తి అల్లూరు రోడ్డు బ్రిడ్జిపై లారీ బోల్తా..!

నెల్లూరు: దగదర్తి మండలం అల్లూరు రోడ్డు బ్రిడ్జి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కోలార్ నుంచి కలకత్తాకు క్యాప్సికం లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తాపడడంతో కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. దీంతో పోలీసులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.