హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి పాము కాటు..!

MLG: వెంకటాపురం మండలం చిరుతపల్లి బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 7 తరగతి విద్యార్థిని కనితి అవిశను సోమవారం రాత్రి పాము కాటేసింది. మూత్రశాలకు వెళ్లిన సమయంలో కాలిపై పాము కాటు వేయడంతో ఉపాధ్యాయులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. విషపూరిత పాము కాటుగా నిర్ధారించిన వైద్యులు చికిత్స అందించారు. పరిస్థితి నిలకడగా ఉండడంతో ములుగు ఆసుపత్రికి తరలించారు.