హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘాట్‌ రోడ్డు వద్ద ప్రమాదం.. ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్‌లూటీ వద్ద నల్లమల ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బోలెరో వాహనం ఎదురెదురుగా వేగంగా ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు.