JN: చిల్పూర్ మండలంలోని గార్లగడ్డతండా పంచాయతీ పరిధి మల్లన్నగండి రిజర్వాయర్‌లో రెండు రోజులుగా గాలింపు చేపట్టగా మంగళవారం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యమైంది. ఆదివారం గల్లంతైన శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళ్యాణ్ (27)గా పోలీసులు గుర్తించారు. ఫైర్ సిబ్బంది, పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి ఒడ్డుకు చేర్చారు.
తెలంగాణ
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతదేహం లభ్యం


