హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్లకు డ్వాక్రా ఆసరా..!

KMM: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఆగకుండా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. జిల్లాలో అత్యధికంగా 3,258 మందికి రూ. 34.46 కోట్ల డ్వాక్రా రుణాలు అందించారు. ప్రభుత్వ బిల్లులు రాకముందే చేతికి డబ్బులు అందడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.