హైదరాబాద్: 28°C
తెలంగాణ

మేళతాళాల మధ్య నవదుర్గల ప్రతిష్ఠాపన..!

WGL: వరంగల్ దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శివనగర్‌లో నవదుర్గల విగ్రహాలను వైభవంగా ప్రతిష్ఠించారు. సాయి దుర్గ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేళతాళాలు, డీజే, విద్యుత్ దీపాల మధ్య విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఉత్సవ వేదికపై ప్రతిష్ఠాపన, దిష్టి తీసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.