హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెక్యూరిటీ ఓవర్ యాక్షన్.. యాచకుడి బలి

GNTR: జీజీహెచ్ భద్రతా సిబ్బంది కర్కశత్వానికి ఓ నిస్సహాయ యాచకుడు బలయ్యాడు. కాలి గాయానికి చికిత్స పొందిన అనంతరం కదల్లేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని సిబ్బంది స్ట్రెచర్‌పై బయటకు తెచ్చి రోడ్డుపై వదిలేశారు. తీవ్రమైన ఎండ, ఆకలికి తాళలేక ఆరోగ్యం క్షీణించి అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు. రోగులను ఆదుకోవాల్సిన సిబ్బందే ఇలా అమానుషంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు.