హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగమేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ జపం, యాగాలు

నెల్లూరు: సంగంలోని శ్రీ కామాక్షీదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక వరుణ జపం, వరుణ యాగాలు నిర్వహించనున్నారు. సమృద్ధిగా వర్షాలు కురిసి, ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి రఘురామయ్య తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు హాజరు కావాలన్నారు.