హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలికపై వేధింపులు.. నిందితుడి అరెస్ట్

ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటనలో నిందితుడిని పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్ఐ నాగ కళ్యాణి తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 4న సాయంత్రం ఇంటికి వెళ్తున్న బాలికను అడ్డుకొని నిందితుడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కుటుంబ సభ్యులు 112కు సమాచారం అందించగా, పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.