W.G: డివిజన్ పరిధిలోని నరసాపురం, పాలకొల్లు, యలమంచిలి, ఆచంట మండలాల్లో ఈ నెల 7న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ కే.మధుకుమార్ తెలిపారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు నిరంతర విద్యుత్తు అందించేందుకు లైన్లను అభివృద్ధి చేస్తున్నందున ఈ అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత


