హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రహదారి కోసం గ్రామస్థుల ఆందోళన..!

HNK: కమలాపూర్ మండలం పంగిడిపల్లి ప్రధాన రహదారి పనులు సగంలోనే నిలిచిపోవడంతో గ్రామస్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. వంటావార్పు నిర్వహిస్తూ కలెక్టర్‌ ఘటనా స్థలానికి రావాలని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసన టెంట్, వంటావార్పు సామగ్రిని తొలగించే క్రమంలో గ్రామస్థులతో తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.